రాష్ట్రంలో అల్లర్లకు జగనే కర్త, కర్మ, క్రియ: పీతల సుజాత
Advertisement
- రాష్ట్రంలో అల్లర్లకు జగనే కర్త, కర్మ, క్రియ అని పీతల సుజాత ఆరోపణ
- ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ వైసీపీ ఎంపీలు దాడులు చేస్తున్నారని విమర్శ
- బీసీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపాటు
- సొంత మేనకోడలు పెళ్లికి జగన్ అడ్డుపడటం సిగ్గుచేటని వ్యాఖ్య
Advertisement
రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు, దౌర్జన్యాలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డే కర్త, కర్మ, క్రియ అని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పీతల సుజాత ఆరోపించారు. జగన్ ఆదేశాల మేరకే వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బెంగళూరులో ఉంటూ పొరుగు రాష్ట్రాల నుంచి గ్యాంగ్‌స్టర్లను తీసుకొచ్చి, రాష్ట్రంలో కూటమి నాయకులు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతుంటే, కేవలం రెండు ప్రాంతాల్లోనే గొడవలు సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని సుజాత ఆరోపించారు. "నామినేషన్ కేంద్రంలోకి ముగ్గురికే అనుమతి ఉంటే, వైసీపీ ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి వందల మందిని తీసుకొచ్చి పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు. బీర్ బాటిళ్లు, రాళ్లు, ఇనుప రాడ్లతో దాడులు చేస్తున్నారు. ఎంపీలుగా ఉన్న వీరికి ఎన్నికల నియమావళి తెలియదా?" అని ఆమె ప్రశ్నించారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం దక్కడం ఇష్టం లేకే, వారు పోటీ చేస్తున్న చోట లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలు గంజాయి బ్యాచ్‌కు, గ్రాడ్యుయేషన్ బ్యాచ్‌కు మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
గతంలో వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, వారి ఇళ్లలో గంజాయి, మద్యం పెట్టి అక్రమ కేసులు బనాయించారని సుజాత గుర్తుచేశారు. ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటే తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల మనసులు గెలుచుకోవాలని, దౌర్జన్యాలతో కాదని హితవు పలికారు.
ఇదే సమయంలో జగన్ కుటుంబ వ్యవహారాలపైనా పీతల సుజాత తీవ్ర విమర్శలు చేశారు. "కుటుంబ బంధాలపై గొడ్డలి వేసిన నీచ చరిత్ర జగన్‌ది. తండ్రి తర్వాత తండ్రి లాంటి మేనమామ, సొంత మేనకోడలు పెళ్లికి అడ్డుపడటం సిగ్గుచేటు. ఆస్తి కోసం సొంత చెల్లిని, తల్లిని దూరం పెట్టిన వ్యక్తి, ఇప్పుడు మేనకోడలి వివాహానికి స్థలం ఇవ్వకుండా మానవతా విలువలను మరిచారు" అని ఆమె మండిపడ్డారు. జగన్ తీరు ఆయన పార్టీ సంస్కృతికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.